Rashid Khan: భారత పౌరసత్వం ఇప్పిస్తామన్నారు.. కానీ: రషీద్ ఖాన్
Rashid Khan : భారత్, ఆస్ట్రేలియా తనకు పౌరసత్వాన్ని ఆఫర్ చేసినట్లు రషీద్ ఖాన్ చెప్పాడు. ఓ బుక్‌లో ఈ విషయాన్ని అతను రాశాడు. అయితే తన స్వంత దేశానికి ఆడలేనప్పుడు, ఇక ఏ దేశానికి కూడా తాను ప్రాతినిధ్యం వహించబోనన్న విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నాడు.
ముంబై: ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్.. క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. టీ20 క్రికెట్ లీగ్‌లో అతనో స్పెషల్ ప్లేయర్‌గా మారాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు ఐపీఎల్‌లోనూ స్టార్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ లెగ్ స్పిన్నర్ ఇటీవల ఓ బుక్ రాశాడు. రషీద్ ఖాన్ ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్డమ్ అనే బుక్‌లో తన అనుభవాలు పంచుకున్నాడతను. 2023 ఐపీఎల్ సీజన్ సమయంలో జరిగిన ఓ ఘటనను ఆ బుక్‌లో అతను గుర్తు చేశాడు. ఓ టీమ్ అధికారితో జరిగిన సంభాషణ గురించి చెప్పాడు. భారత క్రికెట్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం అయ్యిందని, అతనితో మాట్లాడుతున్న సమయంలో తనకు ఓ ఆఫర్ వచ్చినట్లు రషీద్ ఖాన్ తెలిపాడు.
ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు బాగా లేవని, భారత్‌కు వచ్చి ఇక్కడే ఉండిపోవాలని ఆ వ్యక్తి తనను కోరినట్లు రషీద్ బుక్‌లో రాశాడు. భారత పౌరసత్వాన్ని ఇప్పిస్తామని, ఇక్కడ ఉండి, క్రికెట్ ఆడుకోవచ్చు అన్నారని పేర్కొన్నారు. కానీ ఆ అధికారి ఇచ్చిన ఆఫర్‌తో ఆశ్చర్యపోయినట్లు రషీద్ ఖాన్ తెలిపాడు. ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదని, ఓ నవ్వు నవ్వి ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పాడు. తన దేశం ఆఫ్ఘనిస్తాన్ తరపున ఆడుతున్నట్లు చెప్పాననన్నాడు.
ఇండియా ఒక్కటే కాదు, ఆస్ట్రేలియా నుంచి కూడా తనకు సిటిజన్‌షిప్ ఆఫర్ వచ్చినట్లు రషీద్ పేర్కొన్నాడు. ఒకవేళ తాను తన దేశానికి ఆడలేకపోతే, అప్పుడు ఇక ఏ దేశం తరపున కూడా తాను ఆడలేన్న విషయాన్ని వారికి చెప్పినట్లు రషీద్ తన బుక్‌లో రాశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

