హైదరాబాద్ ఆట ప్రతినిధి: ప్రతిష్టాత్మక రంజీ ట్రోపీ ఎలైట్ గ్రూప్-డీ ఆరంభ మ్యాచ్‌లో బంతితో విఫలమైనప్పటికీ బ్యాట్‌తో హైదరాబాద్ దీటుగా బదులిస్తున్నది. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్.. 7 వికెట్ల నష్టానికి 400 రన్స్ చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (132) సెంచరీ చేయగా అనికేత్ రెడ్డి (87), వరుణ్ (57) అర్ధ శతకాలతో రాణించారు.
రాహుల్ రాధేశ్ (47*) క్రీజులో ఉండగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ ఇంకా 129 పరుగులు వెనుకబడి ఉంది. ఢిల్లీ బౌలర్లంతా వికెట్ల వేటలో విఫలమైనా కెప్టెన్ అయూశ్ బదోని (5/69) ఐదు వికెట్లతో సత్తాచాటాడు.