నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ ఎలైట్ 2024-25 సీజన్ సెమీస్ పోరులో భాగంగా డిఫెండింగ్ చాంపియన్స్ ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ తొలి రోజు బ్యాటింగ్‌లో మెరిసింది. నాగ్‌పూర్‌లో సోమవారం మొదలైన మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ 5 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ ధ్రువ్ షోరె (74), డానిష్ మలెవార్ (79) అర్ధ సెంచరీలతో రాణించారు.
యశ్ రాథోడ్ (47 బ్యాటింగ్), కెప్టెన్ అక్షయ్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ముంబై బౌలర్లలో దూబె (2/35), ములాని (2/44) తలా రెండు వికెట్లు తీశారు. ఇక అహ్మదాబాద్‌లో గుజరాత్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో కేరళ.. మొదటి రోజు 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి సచిన్ బేబి (69 బ్యాటింగ్), అజారుద్దీన్ (30 బ్యాటింగ్) రాణించారు.