హైదరాబాద్, ఆట ప్రతినిధి : చండీగఢ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని 283 రన్స్‌కే కట్టడి చేసిన హైదరాబాద్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 415 పరుగులు చేసింది.
అభిరాత్ రెడ్డి (121), హిమతేజ (125 నాటౌట్) శతకాలతో కదం తొక్కారు. అమన్‌రావు (52), ప్రగ్నయ్ (52*) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ ఇప్పటికే 132 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.