రాంచీ: బాలీవుడ్ నటి అమీషా పటేల్‌కి (Ameesha Patel) జార్ఖండ్‌లోని రాంచీ కోర్టు (Ranchi court) షాకిచ్చింది. చెక్‌బౌన్స్ (Cheque bounce), మోసం (Fraud) కేసులో అమీషా, ఆమె వ్యాపార భాగస్వామి కృనాల్‌పై (Krunal) రాంచీ సివిల్ కోర్టు వారెంట్ (Warrant) జారీ చేసింది. సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె గానీ, ఆమె తరఫున లాయర్ గానీ కోర్టు ముందు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో ఈ కేసులో అమీషాతోపాటు ఆమె బిజినెస్ పార్ట్నర్కు వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 15న జరుగనుంది. సినిమా నిర్మాణం విషయంలో తనను మోసం చేశారని ఆరోపిస్తూ జార్ఖండ్‌కు చెందిన అజయ్ కుమార్ సింగ్ (Ajay Kumar Singh) అనే సినీ నిర్మాత ఫిర్యాదు చేశాడు. అమీషా, ఆమె భాగస్వామిపై మోసం, బెదిరింపు, చెక్‌బౌన్స్ విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 420, 120 కింద కేసు నమోదుచేశాడు.
2013లో అమీషా పటేల్, కృనాల్.. దేశీ మ్యూజిక్ (Desi Magic) అనే సినిమా నిర్మాణం, ప్రచారం కోసం తన వద్ద రూ.2.5 కోట్లు తీసుకున్నారని అజయ్ కుమార్ తెలిపారు. సినిమా పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని చెప్పారన్నారు. 2013లో సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ.. అది ఇప్పటికీ విడుదల కాలేదు. ఏండ్లు గడుస్తుండటంతో తన డబ్బు విషయమై వారిని అడిగానని అయినా తిరిగి చెల్లించలేదన్నారు. అయితే చాలా రోజుల తర్వాత 2018 అక్టోబర్‌లో రూ.2.5 కోట్లు, రూ.50 లక్షలతో రెండు చెక్కులు అమీషా పటేల్ ఇచ్చిందని, అయితే అది బౌన్స్ అయిందని వెల్లడించారు.