IND vs NZ : పొట్టి సిరీస్‌లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న భారత్.. గువాహటిలోనే సిరీస్ పట్టేయాలనుకుంటోంది. హ్యాట్రిక్‌పై కన్నేసిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టీ20ల్లోనూ గొప్పగా రాణిస్తున్న హర్షిత్ రానా తొలి ఓవర్లోనే న్యూజిలాండ్‌కు షాకిచ్చాడు. ఓపెనర్ డెవాన్ కాన్వే(1)ను పెవిలియన్ పంపి.. సూపర్ బ్రేకిచ్చాడు. ప్రస్తుతం రచిన్ రవీంద్ర, టిమ్ సీఫర్ట్ క్రీజులో ఉన్నారు.
నాగ్‌పూర్, రాయ్‌పూర్‌లో దుమ్మరేపిన టీమిండియా గువాహటిలోనూ గర్జించేందుకు సిద్ధమైంది. ఈ వేదికపై గత నాలుగు మ్యాచుల్లో రెండొందలకుపైనే స్కోర్లు నమోదయ్యాయి. భారీ స్కోర్ నమోదయ్యే అవకాశమున్నందున కివీస్ హిట్టర్లకు చెక్ పెట్టేందుకు కెప్టెన్ సూర్య బౌలింగ్ అస్త్రాలను రంగంలోకి దింపుతున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి స్థానంలో బుమ్రా, రవి బిష్ణోయ్ తుదిజట్టులోకి వచ్చారు. కివీస్ తుదిజట్టులోకి కైలీ జేమీసన్ వచ్చాడు.
WOW!
How about that for a catch from Hardik Pandya 😎
Wicket in the opening over for Harshit Rana 👏👏
Updates ▶️ https://t.co/YzRfqi0li2#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/vFBWKCB2ze
— BCCI (@BCCI) January 25, 2026
భారత తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, హర్షిత్ రానా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ తుది జట్టు : డెవాన్ కాన్వే, టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), కైలీ జేమీసన్, మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫ్ఫీ.