కల్వకుర్తి, ఫిబ్రవరి 6: డెహ్రాడూన్ వేదికగా జరుగుతున్న జాతీయ క్రీడల నెట్‌బాల్ పోటీల్లో తెలంగాణ కోచ్‌గా మహబూబ్‌నగర్‌కు చెందిన రాము ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని జాతీయ నెట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విక్రమ్ ఆదిత్యారెడ్డి గురువారం తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు రాము తెలంగాణ నెట్‌బాల్ టీమ్‌కు సేవలందిస్తాడని పేర్కొన్నారు. కోచ్‌గా ఎంపికైన రామును గ్రామస్తులు అభినందించారు.