విజ్క్ ఆన్ జి (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ప్రజ్ఞానంద.. వరుసగా రెండో గేమ్‌లోనూ ఓటమిపాలయ్యాడు.
తొలి గేమ్‌లో సహచర గ్రాండ్‌మాస్టర్ అర్జున్ చేతిలో ఓడిన అతడు.. నొదిర్బెక్ అబ్దుసతరోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడిపోయాడు. తొలి మ్యాచ్‌ను గెలిచిన అర్జున్.. థాయ్ డే వాన్ (చెక్)తో జరిగిన రెండో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. గుకేశ్ సైతం జోర్డెన్ వాన్ ఫొరిస్ట్ (నెదర్లాండ్స్)తో మ్యాచ్‌ను డ్రా గా ముగించాడు.