Ramanujamma | రాజన్న సిరిసిల్ల, జనవరి 15 (నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్రానికి చెందిన టమాటం రామానుజమ్మ 70 ఏండ్ల వయసులోనూ సత్తా చాటారు. ప్రపంచ అథ్లెటిక్ పోటీల్లో కాంస్య పతకం సాధించారు.
కర్నాటకలోని మంగళూరులో ఈనెల 11 నుంచి 13 దాకా జరిగిన ఒకటవ సౌత్ ఆసియా మాస్టర్ అథ్లెటిక్ ఓపెన్ చాంపియన్షిప్ పోటీలలో భాగంగా.. రామానుజన్మ 800 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచి కాంస్యం గెలిచారు.