బెంగళూరు : దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీని సెంట్రల్ జోన్ గెలుచుకుంది. బెంగళూరులోని బీసీసీఐ సీవోఈ గ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్లో సెంట్రల్.. సౌత్‌జోన్ నిర్దేశించిన 65 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో సౌత్‌జోన్ పోరాడి (426 ఆలౌట్) సెంట్రల్ విజయాన్ని ఐదో రోజుకు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
సౌత్ బౌలర్లు చకచకా 4 వికెట్లు పడగొట్టినా లక్ష్యం మరీ తక్కువగా ఉండటంతో వాళ్లూ ఏమీ చేయలేకపోయారు. 11 ఏండ్ల విరామం తర్వాత సెంట్రల్ జోన్ దులీప్ ట్రోఫీ టైటిల్‌ను దక్కించుకోవడం విశేషం. ఫైనల్లో తృటిలో ద్విశతకం చేజార్చుకున్న యశ్ రాథోడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా సరాన్ష్ జైన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు.