శ్రీ బైనీ సాహిబ్: ప్రతిష్టాత్మక ఐలీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) 2-1తో రాజస్థాన్ యునైటెడ్ ఎఫ్‌సీపై అద్భుత విజయం సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో శ్రీనిధి అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ విజయంతో శ్రీనిధి 18 పాయింట్లతో రెండో స్థానంలోకి దూసుకెళ్లగా, రాజస్థాన్ 17 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.
మ్యాచ్ మొదలైన 16వ నిమిషంలోనే గెరార్డ్ అర్టిగాస్ గోల్‌తో రాజస్థాన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 24 నిమిషంలో శ్రీనిధి స్ట్రైకర్ డేవిడ్ కాస్టెండా గోల్ ప్రయత్నాన్ని రాజస్థాన్ గోల్‌కీపర్ జేమ్స్ కిథన్ సమర్థంగా నిలువరించాడు. అయితే మ్యాచ్ అదనపు సమయంలో మూడు నిమిషాల వ్యవధిలో హబి ఇద్రిసె(90+2ని) హెడర్ గోల్ చేయగా, కాస్టెండా సూపర్ గోల్‌తో శ్రీనిధి చిరస్మరణీయ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.