న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి బిందర్ వివాదంలో చిక్కుకున్నాడు. ఆర్సీబీతో గత శుక్రవారం మ్యాచ్ సందర్బంగా బిందర్ డగౌట్లో ఫోన్‌తో కనిపించాడు. ప్లేయర్స్ అండ్ మ్యాచ్ ఆఫీషియల్స్ ఏరియా(పీఎమ్వోఏ) ప్రొటోకాల్ ప్రకారం డగౌట్లో ఫోన్లు ఎవరూ ఉపయోగించేందుకు వీలులేదు.
అలాంటిది సూర్యవంశీతో ఉన్న బిందర్ సెల్ఫోన్లో ఏదో చూపిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పీఎమ్వోఏ ప్రొటోకాల్ అనుసరించి టీమ్ మేనేజర్ డ్రెస్సింగ్‌రూమ్‌లో ఫోన్ వాడేందుకు అవకాశముంటుంది, కానీ డగౌట్లో అది నిషేధమని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు.