CSK vs RR : ఐపీఎల్(IPL2024) పదిహేడో సీజన్లో భాగంగా సీఎస్ఎకేతో(CSK) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌తో జట్టు ఆచితూచి ఆడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్(RR) జట్టు తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించింది. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. మొదటి ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండే కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. ప్రస్తుతం ఆర్ఆర్ స్కోరు 14/0 (3ఓవర్లు). కాగా, ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ సేన తప్పక గెలవాల్సిందే. మరోవైపు ఆర్ఆర్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమైనట్లే.