RR vs CSK : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌ను వరుణుడు పలకరించాడు. ఎడిషన్‌లో మూడో మ్యాచ్ టాస్ వర్షం కారణంగా ఆలస్యం కానుంది. ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండడంతో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ టాస్ ఐదు నిమిషాలు ఆలస్యమైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ తీసుకున్నాడు.
తొలి సీజన్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్, ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ గువాహటిలో అమీతుమీకి సిద్ధమయ్యాయి. వేలానికి ముందు రవీంద్ర జడేజా, సంజూ శాంసన్‌లను మార్చుకున్నందున ఈ మ్యాచ్‌పై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. టాస్ గెలిచిన రియాన్ పరాగ్ ఛేదనకే మొగ్గు చూపడంతో సీఎస్కే మొదట ఆడనుంది. ఈసారి ట్రోఫీ గెలవడమే తమ లక్ష్యమని చెప్పిన పరాగ్.. విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. షార్ట్, ఓవర్టన్, నూర్, మ్యాట్ హెన్రీలను ఆడిస్తున్నామని సీఎస్కే సారథి రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
🚨 Toss 🚨@rajasthanroyals have won the toss and will field first in Guwahati!
Updates ▶️ https://t.co/UzbuFk5G26#TATAIPL | #KhelBindaas | #RRvCSK pic.twitter.com/1o0WJiz5aK
— IndianPremierLeague (@IPL) March 30, 2026
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(కెప్టెన్), హిట్మైర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), రుతురాగ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుశ్ మాత్రే, మాథ్యూ షార్ట్, శివం దూబే, కార్తిక్ శర్మ, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్.