IND vs AUS : వన్డే ప్రపంచ కప్ సన్నద్ధతలో ఉన్న భారత జట్టు పెర్త్‌లో ఆదివారం ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఫామ్ చాటుకోవాలని ఆరాటపడుతుండగా.. కొత్త సారథి శుభ్‌మన్ గిల్ సిరీస్ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మొదటి వన్డేలోనే దంచేసి తమపై నెలకొన్న అనుమానాల్ని పటాపంచలు చేయాలని ‘రోకో’ పట్టుదలతో ఉన్నారు. అయితే.. సిరీస్ ఓపెనింగ్ మ్యాచ్‌కు వాన (Rain) ముప్పు పొంచి ఉంది. సరిగ్గా మ్యాచ్ ప్రారంభమయ్యే సరికే వాన పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది.
పెర్త్‌లోని ఓప్టస్ మైదానంలో ఆదివారం ఉదయం 11:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం 9:00 గంటలు) తొలి వన్డే జరుగనుంది. విజయంతో సిరీస్‌ను ఆరంభించాలని ఆతిథ్య జట్టు భావిస్తుండగా.. బోణీతో ఘనంగా పర్యటనను ప్రారంభించాలని శుభ్‌మన్ గిల్ సేన అనుకుంటోంది. అయితే.. ఇరుజట్లకు వరుణుడు షాకిచ్చేలా ఉన్నాడు. Accu Weather నివేదిక ప్రకారం.. మ్యాచ్ మొలయ్యే సమయానికే వాన పడనుంది.
ఆట కొనసాగుతున్నప్పుడు వర్షం పడేందుకు 35 శాతం అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా పలుమార్లు ఆటకు అంతరాయం కలగనుందని సమాచారం. దాంతో.. వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ దళంతో కూడిన టీమిండియా, సొంతగడ్డపై చెలరేగే ఆసీసీ బౌలర్ల మధ్య నువ్వానేనా అన్నట్టు సాగే మ్యాచ్ పూర్తిగా సాగడంపై సందేహాలు నెలకొన్నాయి.
#AUSvIND, 1st ODI Perth weather, pitch report: Will rain spoil #ViratKohli, #RohitSharma comeback?#INDvsAUShttps://t.co/s6FUCFf10X pic.twitter.com/bbyz7nT44a
— IndiaToday (@IndiaToday) October 18, 2025
అంతేకాదు టాస్‌పై కూడా వాతావరణ ప్రభావం పడనుంది. వర్షం పడే అవకాశాలున్నందున టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్‌కే ముగ్గు చూపుతారు. పిచ్ బౌలర్లకు అనుకూలించడం ఖాయం కాబట్టి .. స్వింగ్, బౌన్స్‌తో బ్యాటర్లను ఇరుకున పెట్టేందుకు పేసర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ ఆప్టస్ మైదానంలో మూడు వన్డేలు మాత్రమే నిర్వహించారు. రెండు సందర్భాల్లో ఛేదనకు దిగిన జట్టే విజేతగా నిలిచింది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు మొత్తం.. 183కాగా.. విజయవంతంగా ఛేదించిన లక్ష్యం 153 పరుగులు మాత్రమే.
𝙍𝙚𝙖𝙙𝙮. 𝙎𝙚𝙩. 𝙍𝙚𝙡𝙤𝙖𝙙𝙚𝙙 🔃#TeamIndia Captain Shubman Gill and Australian skipper Mitchell Marsh meet ahead of the 1️⃣st ODI 🏆#AUSvIND | @ShubmanGill pic.twitter.com/MBPaB2iL0R
— BCCI (@BCCI) October 18, 2025
భారత జట్టు అంచనా : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్.
ఆస్ట్రేలియా జట్టు అంచనా : మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, మార్నస్ లబూషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మిచెల్ ఓవెన్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నొలీ, హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, గ్జావియర్ బార్ట్లెట్.