DC vs SRH | సన్‌రైజర్స్, ఢిల్లీ మ్యాచ్‌కు వాన ముప్పు.. అభిమానులకు షాక్ తప్పదా..!
DC vs SRH : పంతొమ్మిదో సీజన్లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)కు వరుణుడు షాక్ ఇచ్చేలా ఉన్నాడు. ఉప్పల్ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటిల్స్(Delhi Capitals)తో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించేలా ఉంది.
DC vs SRH : పంతొమ్మిదో సీజన్లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)కు వరుణుడు షాక్ ఇచ్చేలా ఉన్నాడు. ఉప్పల్ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటిల్స్(Delhi Capitals)తో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించేలా ఉంది. మధ్యాహ్నం నుంచే వాతావరణం చల్లబడగా.. సాయంత్రం పలు ప్రాంతాల్లో చినుకులు పడ్డాయి. ఉప్పల్ స్టేడియంలో వానపడి మ్యాచ్‌కు అడ్డంకి ఏర్పడేందుకు 50 శాతం అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఒకవేళ అదే జరిగితే సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయంతో మురవాలనుకున్న ఆరెంజ్ ఆర్మీకి, అభిమానులకు నిరాశే ఎదురవ్వనుంది.
ఉప్పల్ స్టేడియంలో రెచ్చిపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుకు వరుణుడు అడ్డుపడేలా ఉన్నాడు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం పడగా.. మ్యాచ్ సమయానికి ముందే మంగళవారం కూడా వాన అందుకుంది. వాతావరణం చల్లబడడంతో హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్ పూర్తి ఓవర్ల ఆట జరగడంపై సందేహాలు నెలకొన్నాయి.
Frames of Matchday energy 📸✨ pic.twitter.com/yDic7GZCza
— SunRisers Hyderabad (@SunRisers) April 21, 2026
ప్రస్తుతం ఆరు మ్యాచుల్లో మూడేసి విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ఇషాన్ కిషన్ బృందం ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. అయితే.. ఢిల్లీ ఐదింట మూడు విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. రికార్డుల విషయానికొస్తే ఇరుజట్లు 25 సార్లు తలపడగా హైదరాబాద్ 13 విజయాలతో పైచేయి సాధించింది.
కుర్రాళ్లే గెలుపు గుర్రాలు..
బలాబలాల విషయంలో సన్‌రైజర్స్, ఢిల్లీ సమానంగా ఉన్నాయి. ప్రతి సీజన్లో బ్యాటర్లనే నమ్ముకునే హైదరాబాద్‌ను ఈసారి బౌలర్లు గెలిపిస్తున్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ ఇషాన్, క్లాసెన్ దంచేస్తుండగా.. కొత్త కుర్రాళ్లు ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్‌లు వికెట్ల వేటతో విజయంలో కీలకమవుతున్నారు.
SRH vs DC IPL 2026: Rain Threat Looms — Check Hyderabad Weather Forecast Today Ahead Of Matchhttps://t.co/4G1Yiekt0y
— NDTV Profit (@NDTVProfitIndia) April 21, 2026
ఢిల్లీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. హైదరాబాద్‌లా ఆ జట్టు సైతం బ్యాటింగ్‌లో ఒకరిద్దరి మీదే ఆధారపడుతోంది. ముఖ్యంగా కుర్రాడు సమీర్ రిజ్వీ, రాహుల్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్ ఢిల్లీకి ఆస్తిలా మారారు. బౌలింగ్‌లో కుల్దీప్, ముకేశ్ కుమార్, అకీబ్ నబీ రాణిస్తున్నారు. గత మ్యాచ్‌లో గాయపడిన ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ కోలుకుని ఫిట్నెస్ సాధించడం ఆ జట్టు బలాన్ని మరింత పెంచనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

