WI vs PNG టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్(West Indies) తొలి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. గయనాలో పపువా న్యూ గినియా(PNG)తో జరుగుతున్న పోరులో విండీస్ ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే వాన మొదలైంది. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు పరుగులు తీశారు. అప్పటికీ విండీస్ స్కోర్.. 8/1.
స్వల్ప ఛేదనలో కరీబియన్ జట్టుకు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. డేంజరస్ ఓపెనర్ జాన్సన్ చార్లెస్(0) సున్నాకే ఔటయ్యాడు. అలీ నవో ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ క్రీజులోకి వచ్చాడు.
తొలుత ఆడిన పపువా న్యూ గినియా 8 వికెట్ల నష్టానికి 136 రన్స్ చేసింది. టాపార్డర్‌లో కెప్టెన్ అస్సాద్ వలా(21) రాణించగా.. సెస్ బౌ(50), చార్లెస్ అమిని(12)లు విండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ఐదో వికెట్‌కు వీళ్లు 44 రన్స్ జోడించారు. 50 పరుగులకే నాలుగు కీలక వికెట్లు పడిన దశలో ఈ ఇద్దరూ కీలక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. చివర్లో వికెట్ కీపర్ కిప్లిన్ డొరిగ(27 నాటౌట్), చాడ్ సోపర్(10)లు చకచకా డబుల్స్ తీసి జట్టు స్కోర్ 130 దాటించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
సెస్ బౌ(50)