Unofficial Test | భారత బౌలర్ల జోరుకు వర్షం అంతరాయం.. శ్రీలంక ఏ బతికిపోయేనా..!
Unofficial Test : భారత్ ఏ, శ్రీలంక ఏ జట్ల మద్య జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. టీమిండియా 189జ8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన కాసేపటికే వర్షం అందుకుంది.
Unofficial Test : భారత్ ఏ, శ్రీలంక ఏ జట్ల మద్య జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. టీమిండియా 189జ8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన కాసేపటికే వర్షం అందుకుంది. 6.3 ఓవర్లకు వర్షం మొదలవ్వడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. 312 పరుగుల లక్ష్య ఛేదనలో లంకను భారత బౌలర్లు బెంబేలెత్తిస్తూ రెండు వికెట్లు తీశారు.
మొదటి అనధికారిక టెస్టు నాలుగో రోజు భారత ఏ విజయానికి వరుణుడు అడ్డుపడుతున్నాడు. రెండో ఇన్నింగ్స్‌ను 1898 వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా.. అనంతరం వికెట్ల వేట మొదలెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో లంకను కూల్చిన అకీబ్ నబీ ధార్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ దెబ్బకొట్టాడు. 312 పరుగుల ఛేదనకు దిగిన లంకకు షాకిస్తూ.. ఓపెనర్ పవంత వీరసింఘే(20)ను బౌల్డ్ చేశాడు. హర్ష్ దూబే ఓవర్లో నిరోషన్ డిక్వెల్లా(9) ఔటవ్వగా.. 34 పరుగులకే లంక ఓపెనర్లను కోల్పోయింది. వర్షం పడే సమయానికి అషెన్ బండారా(1 నాటౌట్), నువనిందు ఫెర్నాండో(2 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. 6.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 37 రన్స్ కొట్టిన ఆతిథ్య జట్టు.. విజయానికి ఇంకా 275 రన్స్ కావాలి.
160 పరుగుల ఆధిక్యం
గాలే స్టేడియంలో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టులో భారత ఏ పట్టుబిగించింది. రంజీ వీరుడు అకీబ్ నబీ(4-58) బంతితో విజృంభించగా మూడోరోజే శ్రీలంక ఏ కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోర్ 113/2తో ఇన్నింగ్స్ మొదలెట్టిన లంకను యశ్ ఠాకూర్(2-51) దెబ్బకొట్టాడు.

అర్ధశతకంతో విసిగించిన నువనిందు ఫెర్నాండో(84)ను ఔట్ చేసిన ఠాకూర్ వికెట్ల వేటకు తెరతీశాడు. అంజల బండార(70)ను వెనక్కి పంపిన నబీ.. లోయర్ ఆర్డర్‌ను పడగొట్టాడు. నబీ ధాటికి శ్రీలంక ఏ 330 పరుగులకే ఆలౌటైంది. 160 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ ఏ .. 1188 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
సాయి, జురెల్ శతకమోత
ఓపెనర్ సాయి సుదర్శన్(132), ఆయుష్ పాండే(25)లు భారత ఏ జట్టుకు శుభారంభమిచ్చారు. తొలి వికెట్‌కు 92 రన్స్ జోడించిన సాయి.. ఆ తర్వాత దేవ్‌దత్ పడిక్కల్(12), రుతురాజ్ గైక్వాడ్(22)లతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. షేక్ రషీద్(63), ధ్రువ్ జురెల్(141 నాటౌట్) మెరవగా.. తొలి రోజే 4 వికెట్ల నష్టానికి 333 రన్స్ కొట్టిన భారత్.. రెండో రోజూ జోరు చూపింది.

రషీద్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన జురెల్ రెండో రోజు లంక బౌలర్లను పరీక్షించాడు. హర్ష్ దూబే(30)తో కలిసి స్కోర్ నాలుగొందలు దాటించాడు. దూబేను గుణశేఖర( 3-84) ఔట్ చేశాక 452-6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది భారత ఏ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

