ధర్మశాల: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన తొలి వన్డే(India vs Afghanistan) వర్షం వల్ల ఆలస్యం అవుతోంది. ధర్మశాలలో ప్రస్తుతం స్వల్ప వర్షం కురుస్తోంది. దీంతో టాస్‌ను నిలిపివేశారు. మ్యాచ్ జరుగుతుందో లేదో అన్న పరిస్థితి నెలకొన్నది. పిచ్‌పై ఇంకా కవర్స్ ఉన్నాయి. వర్షపు చినుకులు అప్పుడప్పుడు కురుస్తూ ఆగిపోతున్నాయి. ఇవాళ రాత్రి 10 గంటల వరకు 60 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. నిజానికి మధ్యాహ్నం ఒంటి గంటలకు టాస్ పడాల్సి ఉంది. కానీ నిరవధికంగా కురుస్తున్న జల్లుల వల్ల టాస్‌ను ఆలస్యం చేశారు. శుభమన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు తన టెస్టు ఫామ్‌ను కొనసాగించేందుకు ఆసక్తిగా ఉంది. ముల్లాన్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో ఇండియా ఇన్నింగ్స్ 300 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. వన్డేల్లో కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ అయ్యర్ వ్యక్తిగత మైలురాళ్లకు చేరువయ్యారు. గిల్ మరో 47 రన్స్, అయ్యర్ మరో 23 రన్స్ చేస్తే మూడు వేల పరుగుల మైలురాయి చేరుకుంటారు.
🚨 Update from Dharamshala 🚨
Toss for the 1️⃣st #INDvAFG ODI has been delayed due to rain.
Stay tuned for more updates ▶️ https://t.co/lCuohEZYAl#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/cMPZs6Kj8r
— BCCI (@BCCI) June 13, 2026