Headingley Test : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు క్రీజులో పాతుకుపోయారు. దాంతో, జట్టు ఆధిక్యం 150 పరుగులు దాటింది. నాలుగో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ పేసర్లను దీటుగా ఎదుర్కొన్న కేఎల్ రాహుల్(72 నాటౌట్) అర్ధ శతకంతో కదం తొక్కగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(31 నాటౌట్) తన సహజ శైలికి విరుద్దంగా సంయమనంతో ఆడుతున్నాడు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు విలువైన 61 రన్స్ జోడించారు. దాంతో, లంచ్ టైమ్‌కు 153 రన్స్ కొట్టిన టీమిండియా తమ ఆధిక్యాన్ని 159కి పెంచుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసి స్వల్ప ఆధిక్యం సాధించిన టీమిండియా.. మ్యాచ్‌పై పట్టుబిగేంచే దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోర్ 90/2తో నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే కార్సే షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్(8)ను బౌల్డ్ చేసి ఇంగ్లండ్‌కు బ్రేకిచ్చాడు. కానీ, ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్ (31 నాటౌట్) వచ్చిరాగానే బాదకుండా క్రీజులో కుదురుకోవడానికి ప్రాధాన్యమిచ్చాడు. అయితే అతడికి కార్సే ఓవర్లో లైఫ్ లభించింది. అనంతరం టంగ్ ఓవర్లో రాహుల్ స్లిప్‌లో కట్ షాట్ ఆడగా.. అక్కడే కాచుకొని ఉన్న హ్యారీ బ్రూక్ క్యాచ్ అందుకోలేకపోయాడు.
A half-century stand between KL Rahul & Rishabh Pant 👍 👍#TeamIndia move closer to the 150-run mark.
Updates ▶️ https://t.co/CuzAEnAMIW #ENGvIND | @klrahul | @RishabhPant17 pic.twitter.com/It81g7LuC8
— BCCI (@BCCI) June 23, 2025
స్టోక్స్ టీమ్ ఎంత ప్రయత్నించినా సరే రాహుల్, పంత్ వికెట్ ఇవ్వలేదు. నింపాదిగా ఆడిన వీళ్లు జట్టు ఆధిక్యాన్ని 159కి పెంచారు. తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్(147), పంత్(138), యశస్వీ జైస్వాల్(101) ఇంగ్లండ్ బౌలింగ్ దళాన్ని ఉతికారేస్తూ సెంచరీలతో చెలరేగగా టీమిండియా 471 రన్స్ కొట్టింది. అనంతరం జస్ప్రీత్ బుమ్రా ధాటికి ఆతిథ్య జట్టు 465 పరుగులకు ఆలౌటయ్యింది. ఆ జట్టులో ఓలీ పోప్(106), హ్యారీ బ్రూక్ (99), బెన్ డకెట్(62)లు రాణించారు.