హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ యువ క్రికెటర్ రాహుల్ కార్తీకేయ.. ప్రతిష్టాత్మక ఎమ్ఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌కు ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న యువ పేసర్ రాహుల్ ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. మెరికల్లాంటి యువ పేసర్లను అద్భుతంంగా తీర్చిదిద్దడంలో పేరు గాంచిన ఎమ్ఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో రాహుల్ తర్ఫీదు పొందనున్నాడు.
యువ పేసర్ ఎంపికపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తం చేసింది. అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ హైదరాబాద్ క్రికెట్ గర్వపడే రీతిలో రాహుల్ ఎదగాలని హెచ్‌సీఏ ఆకాంక్షించింది.