KL Rahul : భారత జట్టుకే కాదు దేశవాళీలోనూ తాను ఆపద్భాదవుడిని అని చాటుకున్నాడు కేఎల్ రాహుల్. రంజీ ట్రోఫీ (Ranji Trophy) క్వార్టర్ ఫైనల్లో ఈ క్లాస్ బ్యాటర్ సెంచరీతో గర్జించాడు. ముంబై బౌలర్లను చితక్కొడుతూ శతకంతో కర్నాటకను సెమీ ఫైనల్ చేర్చాడు. 325 పరుగుల ఛేదనలో రెచ్చిపోయిన రాహుల్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో 42 సార్లు ఛాంపియన్ ముంబైని ఇంటికి పంపాడు. దాంతో.. 11 ఏళ్ల తర్వాత టైటిల్ వేటకు అడుగు దూరంలో నిలిచింది కర్నాటక.
రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో కేఎల్ రాహుల్ తన తడాఖా చూపించాడు. ముంబై నిర్దేశించిన భారీ ఛేదనలో మూడంకెల స్కోర్‌తో కర్నాటకను సెమీస్ తీసుకెళ్లాడు. ఎంసీఏ బీకేసీ మైదానంలో నాలుగో రోజు మయాంక్ అగర్వాల్(3) విఫలమవ్వగా.. రాహుల్‌నే నమ్ముకుంది కర్నాటక. శార్దూల్ ఠాకూర్, తుషార్ పాండే ఓవర్లో చెత్త బంతులను శిక్షించి లక్ష్యాన్ని కరిగించాడు.
💯 for KL Rahul 💪
He’s leading Karnataka’s charge in the chase with a superb innings so far 👌
Scorecard ▶️ https://t.co/MY9jsHbz9r#RanjiTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/aUXNEYdTZW
— BCCI Domestic (@BCCIdomestic) February 9, 2026
రాహుల్(130)కు కెప్టెన్ దేవ్‌దత్ పడిక్కల్(39) అండగా నిలవగా చక్కని కవర్ డ్రైవ్స్‌తో అలరించిన అతడు అర్ధ శతకం భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం స్మరన్ రవిచంద్రన్(83 నాటౌట్)తో కలిసి విలువైనరన్స్ జోడించిన ఈ సొగసరి బ్యాటర్ 147 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడికిది 24వ సెంచరీ. రాహుల్ ఖతర్నాక్ శతకంతో నాలుగు వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది కర్నాటక.
తొలి ఇన్నింగ్స్‌లో కర్నాటకు 53 పరుగుల ఆధిక్యం సమర్పించుకున్న ముంబై.. రెండో ఇన్నింగ్స్‌లో ఛాంపియన్‌లా ఆడింది. వికెట్ కీపర్ ఆకాశ్ ఆనంద్(70) హాఫ్ సెంచరీతో మెరవగా.. ఆఖర్లో తనుష్ కొతియాన్(48 నాటౌట్), తుషార్ దేశ్‌పాండే(47)లు కర్నాటక బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరి పట్టుదలతో రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 375 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.