IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జోరు కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్లుతున్న ఢిల్లీ చిన్నస్వామిలో రాయల్ ఛాలెంజర్స్(RCB)కు చెక్ పెట్టింది. పవర్ ప్లేలో కీలక వికెట్లు పడినా అదరని బెదరని కేఎల్ రాహుల్(93 నాటౌట్) అర్ధ శతకంతో విజృంభించాడు. సాధికారిక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. ట్రిస్టన్ స్టబ్స్(38 నాటౌట్)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును గెలుపు బాట పట్టించాడు. దాంతో, ఢిల్లీ ఆడుతూపాడుతూ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంత మైదానంలో వరుసగా రెండో ఓటమి మూగట్టుకుంది ఆర్సీబీ .
టేబుల్ టాపర్స్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పైచేయి సాధించింది. సొంతగడ్డపై విజయం రెండో స్థానానికి ఎగబాకాలనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లింది. తొలుత 163 చిన స్వల్ప ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే కష్టాల్లో పడింది. 3 ఓవర్లకే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. యశ దయాల్ బౌలింగ్‌లో ఫాఫ్ డూప్లెసిస్(2) రజత్ పటిదార్‌కు క్యాచ్ ఇచ్చాడు. కాసేపటికే ఫ్రేజర్ మెక్‌గుర్క్(7)ను భువనేశ్వర్ వెనక్కి పంపాడు. జితేశ్ శర్మ ఒడుపుగా అందుకున్నాడు. దాంతో, 10 వద్దనే ఢిల్లీ 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఇంప్యాక్ట్ ప్లేయర్ అభిషేక్ పొరెల్(7), అక్షర్ పటేల్(15)లు ధాటిగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకున్నారు. 54కే నాలుగు వికెట్లు పడిన ఢిల్లీని కేఎల్ రాహుల్(93 నాటౌట్)ఆదుకున్నాడు.
𝐌𝐨𝐦𝐞𝐧𝐭𝐮𝐦 = 𝐏𝐨𝐰𝐞𝐫𝐞𝐝 𝐛𝐲 𝐊𝐋 & 𝐒𝐭𝐮𝐛𝐛𝐬 👊
🎥 KL Rahul and Tristan Stubbs launch an attack to ignite #DC‘s chase 💪
They need 30 off 24.
Updates ▶ https://t.co/h5Vb7sp2Z6#TATAIPL | #RCBvDC | @DelhiCapitals | @klrahul pic.twitter.com/LICgoUF3xy
— IndianPremierLeague (@IPL) April 10, 2025
టాపార్డర్ వెనుదిరిగాక ఢిల్లీపై ఒత్తిడి పడింది. కానీ, రాహుల్ కూల్‌గా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. యశ్ దయాల్ వేసిన 14వ ఓవర్లో సింగిల్ తీసి అర్ధ శతకం సాధించాడు. 37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ కొట్టి జట్టును ఆదుకున్నాడు. యువకెరటం ట్రిస్టన్ స్టబ్స్()తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. హేజిల్‌వుడ్ వేసిన 15వ ఓవర్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 22 రన్స్ రాబట్టాడు. మరోవైపు ట్రిస్టన్ స్టబ్స్(38 నాటౌట్) సైతం బ్యాట్ ఝులిపించాడు. సుయాశ్ బౌలింగ్‌లో 4, 6 కొట్టిన ఈ చిచ్చరపిడుగు.. భువీ వేసిన 17వ ఓవర్లో రెండు ఫోర్లు సంధించాడు. అనంతరం దయాల్ బౌలింగ్‌లో 6, 4, 6 బాదిన రాహుల్ ఢిల్లీకి 6 వికెట్ల విజయాన్ని అందించాడు.
Never ever doubting kl Rahul again.. pic.twitter.com/6dMsfzJa7U
— Juders (@RMAguyx) April 10, 2025
చిన్నస్వామి మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాపార్డర్ కుప్పకూలింది. టర్నింగ్ పిచ్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్లు రెచ్చిపోవడంతో పెవిలియన్‌కు క్యూ కట్టారు. పవర్ ప్లేలో ధాటిగా ఆడిన ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(37) టాప్ స్కోరర్. పవిప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడిన రజత్ పటిదార్(25), విరాట్ కోహ్లీ(22)లు విఫలమయ్యారు. అయితే.. టిమ్ డెవిడ్(37 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో బెంగళూరును ఒడ్డున పడేశాడు. డెత్ ఓవర్లలో రెచ్చిపోయిన అతడు 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాది జట్టు స్కోర్ 160 దాటించాడు. డేవిడ్ అద్భుత హిట్టింగ్తో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.