MI vs KKR : ఐపీఎల్ ఆరంభ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోర్‌తో ముంబై ఇండియన్స్‌కు సవాల్ విసిరింది. ముంబై కంచుకోట వాంఖడేలో ఓపెనర్లు అజింక్యా రహానే(67), ఫిన్ అలెన్(37)లు శుభారంభంతో కోల్‌కతా ఇన్నింగ్స్‌కు ఊపపునిచ్చారు. అలెన్ ఔటైనా.. అర్ధ శతకంతో రెచ్చిపోయిన రహానేకు అంగ్క్రిష్ రఘువంశీ(51) మెరుపులు తోడవ్వగా ముంబై బౌలర్లు డీలా పడ్డారు. డెత్ ఓవర్లలో వైస్ కెప్టెన్ రింకూ సింగ్(33 నాటౌట్) తన స్టయిల్ విధ్వంసంతో కోల్‌కతా నాలుగు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
పంతొమ్మిదో సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లో రెండొందల స్కోర్ నమోదైంది. వాంఖడేలో ముంబై ఇండియన్స్ బౌలర్లను చితక్కొడుతూ కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు కొండంత స్కోరందించారు. ఓపెనర్లు అజింక్యా రహానే(67), ఫిన్ అలెన్(37) శుభారంభమివ్వగా.. కుర్రాడు అంగ్క్రిష్ రఘువంశీ(51) అర్ధ శతకంతో చెలరేగిపోయాడు. టాపార్డర్ మెరుపులతో కోల్‌కతా స్కోర్‌బోర్డు రాకెట్ వేగంతో పరుగులు తీసింది. ఆఖర్లో రింకూ సింగ్(33 నాటౌట్) తన మార్క్ విధ్వంసం సృష్టించాడు.
Innings Break!
Half-centuries by Captain Ajinkya Rahane and Angkrish Raghuvanshi led @KKRiders‘ effort 🔝
Who bags the 2⃣ points tonight? 🤔
Scorecard ▶️ https://t.co/JmJcgsoHQ7#TATAIPL | #KhelBindaas | #MIvKKR pic.twitter.com/D6h9Tk18z5
— IndianPremierLeague (@IPL) March 29, 2026
వాంఖడేలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ సమర్పించుకుంది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లోనే సిక్సర్‌తో రహానే తన ఉద్దేశం చాటగా.. అరంగేట్రం కుర్రాడు ఘజన్ఫర్కు అలెన్ చుక్కలు చూపించాడు. హార్దిక్ పాండ్యా వేసిన నాలుగో ఓవర్లో రెచ్చిపోయిన ఈ ద్వయం 26 పరుగులు పిండుకుంది. తొలి రెండు బంతుల్ని రహానే సిక్సర్లుగా మలచగా.. అలెన్ మూడు ఫోర్లతో చెలరేగాడు. ఈ జోడీని విడదీసేందుకు శార్దూల్ ఠాకూర్‌కు బంతి అందించిన కెప్టెన్ పాండ్యా ఫలితం రాబట్టాడు. సిక్సర్‌కు యత్నించిన అలెన్ బౌండరీ వద్ద తిలక్‌కు దొరికాడు. వీరిద్దరి వీరబాదుడుతో పవర్ ప్లేలో కోల్‌కతా 71 పరుగులు చేసింది.
A 28-ball fifty to start the new season 🙌
Angkrish Raghuvanshi with an impactful knock to power #KKR 👌
Updates ▶️ https://t.co/JmJcgsoHQ7#KhelBindaas | #MIvKKR | @KKRiders | @angkrish10 pic.twitter.com/5GqvyZHXLI
— IndianPremierLeague (@IPL) March 29, 2026
అలెన్ తర్వాత వచ్చిన కామెరూన్ గ్రీన్(18)ను శార్ధూల్ వెనక్కి పంపగా.. అంగ్క్రిష్ రఘువంశీ(51) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రహానేతో కలిసి ముంబై బౌలింగ్ దళాన్ని దీటుగా ఎదుర్కొన్న ఈ కుర్రాడు జట్టుకు భారీ స్కోరందిస్తూ హాఫ్ సెంచరీ బాదాడు. వీరిద్దరి తర్వాత రింకూ సింగ్(33 నాటౌట్) దూకుడుగా ఆడడంతో డెత్ ఓవర్లలో 43 పరుగులు వచ్చాయి. ఫలితంగా మంబైకి 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది కోల్‌కతా.