టీమిండియా తాత్కాలిక టెస్టు సారధి అజింక్య రహానే కొంతకాలంగా ఫామ్‌లేమితో అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. దీని వల్ల అతనిపై మానసిక ఒత్తిడి పెరిగి ఉంటుందని, ఇదే అతని సమస్య అని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే రహానే మానసిక పరిస్థితే అతని సమస్య అని తాను అనుకోవడం లేదని మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓఝా చెప్పాడు.
కివీస్‌తో జరుగుతున్న టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రహానే ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. అతను అవుటైన విధానం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఓఝా.. ‘రహానే మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని నేను అనుకోవడం లేదు. అతని సమస్య ఫుట్‌వర్క్ ప్రధానమైన సమస్యగా కనిపిస్తోంది’ అని విశ్లేషించాడు.
రహానే ఫుట్‌వర్క్ సరిగా లేదని, చాలామంది మాజీ ఆటగాళ్లు ఇదే విషయాన్ని ఎత్తి చూపారని ఓఝా వివరించాడు. కాగా, భారత రెండో ఇన్నింగ్స్‌లో వ్యక్తిగత స్కోరు 4 వద్ద రహానే.. ఎల్బీగా అవుటయ్యాడు.