టెన్నిస్ సూపర్ స్టార్ రఫేల్ నాదల్ తండ్రి అయ్యాడు. నాదల్ భార్య మెరీ పరేలో మగబిడ్డకు జన్మనిచ్చినట్లు స్పానిష్ వార్తాసంస్థలు ప్రచురించాయి. నాదల్ దంపతులు నివశించే మాలోర్కా దీవిలోని ఒక ఆస్పత్రిలో మెరీ డెలివరీ జరిగినట్లు సమాచారం. వీళ్లిద్దరూ చాలా కాలం డేటింగ్ తర్వాత 2019లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
నాదల్ పబ్లిక్ రిలేషన్స్ చూసుకునే సంస్థను ఈ విషయంలో ప్రశ్నించగా.. అతని వ్యక్తిగత విషయాలపై తాము స్పందించబోమని తేల్చేసింది. ఇటీవలే తన స్నేహితుడు, తోటి టెన్నిస్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్ ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సమయంలో నాదల్ కంటనీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. నాదల్ ఖాతాలో ఇప్పటి వరకు 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి.