Rafael Nadal | మలాగా(స్పెయిన్): టెన్నిస్‌లో ఒక శకం ముగిసింది. తన అద్భుత ఆటతీరుతో ఇన్నేండ్లు ప్రపంచ అభిమానులను అలరించిన స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన నాదల్ స్పెయిన్ తరఫున ఆఖరి ఆట ఆడేశాడు.
డేవిస్‌కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో నాదల్ 4-6, 4-6తో బోటిక్ వాన్డీ చేతిలో ఓటమిపాలయ్యాడు. మ్యాచ్ తర్వాత నాదల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.