మౌంట్మాంగనీ: కేన్ విలియమ్సన్ (112 బ్యాటింగ్; 15 ఫోర్లు), రచిన్ రవీంద్ర (118 నాటౌట్; 13 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదంతొక్కడంతో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ మంచి స్కోరు దిశగా సాగుతున్నది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ తొలి రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 258 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా ఆరుగురు సఫారీ ప్లేయర్లు అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశారు.