ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర(65) రికార్డులు బద్ధలు కొడుతున్నాడు. ఆడుతున్నది తొలి వరల్డ్ కప్ అయినా.. ఇప్పటికే రెండు సెంచరీలు బాదిన రచిన్.. శనివారం పాక్‌పై హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ టోర్నీలో అతడికి ఇది ఐదో అర్థ శతకం కావడం విశేషం. కేన్ విలియమ్సన్ (33) తో కలిసి రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించాడు. 24 ఓవర్లకు కివీస్ స్కోర్.. 153/1.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్ డెవాన్ కాన్వే(35), రవీంద్ర శుభారంభం ఇచ్చారు. అయితే.. హసన్ అలీ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి రిజ్వాన్ క్యాచ్ పట్టడంతో కాన్వే వెనుదిరిగాడు. దాంతో, తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.