లాస్ వెగాస్ (యూఎస్) : భారత చెస్ సంచలనం ప్రజ్ఞానంద, తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి లాస్‌వెగాస్ వేదికగా జరుగుతున్న ఫ్రీస్టయిల్ చెస్ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. 19 ఏండ్ల ప్రజ్ఞానంద.. ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు.
గ్రూప్ స్టేజ్‌లో భాగంగా ఇరువురి మధ్య జరిగిన పోరు (నాలుగో రౌండ్)లో భారత గ్రాండ్‌మాస్టర్.. 39 ఎత్తుల్లోనే కార్ల్‌సన్‌ను చిత్తుచేశాడు. ప్రజ్ఞానందతో పాటు గ్రూప్ బ్లాక్ నుంచి అర్జున్ కూడా క్వార్టర్స్ చేరాడు.