దుబాయ్: భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరాడు. ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్‌లో దుమ్మురేపుతున్న అశ్విన్ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 864 పాయింట్లతో నంబర్‌వన్ ప్లేస్‌కు దూసుకెళ్లాడు. ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్.. రెండో స్థానానికి పడిపోయాడు. గాయం కారణంగా చాన్నాళ్లుగా ఆటకు దూరమైన భారత ఏస్ పేసర్ బుమ్రా నాలుగో స్థానంలో ఉండగా.. జడేజా ఓ స్థానం మెరుగుపర్చుకొని 8వ ర్యాంక్‌కు చేరాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ మూడో ప్లేస్‌లో ఉన్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఆసీస్ ప్లేయర్ లబుషేన్ టాప్‌లో ఉండగా.. టీమ్ఇండియా నుంచి అత్యుత్తమంగా రిషబ్ పంత్ ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచాడు. రెండు స్థానాలు కోల్పోయిన రోహిత్ శర్మ తొమ్మిదో ప్లేస్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా టాప్‌లో ఉండగా.. అశ్విన్ రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.