లక్నో: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో.. దక్షిణాఫ్రికా ధీటుగా బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ డీకాక్ హాఫ్ సెంచరీ చేశాడు. క్వింటన్ డీకాక్(Quinton de Kock) 51 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 రన్స్ చేశాడు. వన్డేల్లో అతనికి ఇది 31వ హాఫ్ సెంచరీ. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకున్నది. ప్రస్తుతం 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 108 రన్స్ చేసింది. డీకాక్ 66 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. బవుమా 35 రన్స్ చేసి ఔటయ్యాడు.