విశాఖపట్టణం: దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్(Quinton de Kock) .. వన్డేల్లో 33వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. భారత్‌తో విశాఖపట్టణంలో జరుగుతున్న మూడవ వన్డేలో అతను అర్థశతకం బాదాడు. 42 బంతుల్లో అతను ఫిఫ్టీ కొట్టేశాడు. రెండో వికెట్‌కు కెప్టెన్ బవుమా, డీకాక్ 113 రన్స్ జోడించారు. ఓపెనర్ రికల్టన్ డకౌట్ కాగా, బవుమా తీటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అతను 48 రన్స్ చేసి ఔటయ్యాడు. తాజా సమాచారం ప్రకారం సౌతాఫ్రికా 24 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 138 రన్స్ చేసింది. డీకాక్ 82, బ్రెట్జీ 5 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
Partnership broken!
Temba Bavuma departs as Ravindra Jadeja strikes ⚡️
Virat Kohli with the catch 🙌
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/lqNhWSrxD9
— BCCI (@BCCI) December 6, 2025