పారిస్: పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పీవీ సింధు(𝐏.𝐕 𝐒𝐢𝐧𝐝𝐡𝐮).. బ్యాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. చాలా ఈజీగా ఆమె మ్యాచ్‌ను ముగించింది. వరల్డ్ ర్యాంక్ 73 ఉన్న క్రిస్టిన్ కూబాపై 21-5, 21-10 స్కోరుతో రెండవ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్రీ క్వార్టర్స్‌లో ఆరవ సీడ్ హీ బిన్‌జావో తో సింధు తలపడనున్నది.
టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన పీవీ సింధు.. పారిస్‌లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి గేమ్‌తో పాటు రెండవ గేమ్‌లోనూ దూకుడుగా ఆడింది. 33 నిమిషాల్లోనే ఆమె ప్రత్యర్థిని మట్టికరిపించింది. తొలి మ్యాచ్‌లో 21-9, 21-6 స్కోరుతో ఫాతిమా అబ్దుల్ రజాక్‌పై 29 ఏళ్ల సింధు విజయం సాధించింది. తొలి గేమ్‌ను సింధు కేవలం 14 నిమిషాల్లో సొంతం చేసుకున్నది. రెండవ గేమ్‌లో కూబా కొంత ఫైట్ ఇచ్చింది.
𝐁𝐈𝐆 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: 𝐏.𝐕 𝐒𝐢𝐧𝐝𝐡𝐮 𝐬𝐭𝐨𝐫𝐦𝐬 𝐢𝐧𝐭𝐨 𝐏𝐫𝐞-𝐐𝐅
Sindhu thrash WR 73 Kristin Kuuba 21-5, 21-10 in her 2nd & final Group stage clash. #Paris2024 #Paris2024withIAS #Paris2024withIAS pic.twitter.com/jXfY6p66Fd
— India_AllSports (@India_AllSports) July 31, 2024