న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు ఇటీవలి కాలంలో డిఫెన్స్‌లో చాలా మెరుగైందని ఆమె వ్యక్తిగత కోచ్ పార్క్ సంగ్ పేర్కొన్నాడు. డిఫెన్స్ లోపాల కారణంగా సింధు పరాజయాలు చవి చూసేదని.. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఆమె తన వాటిని అధిగమించడం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని సంగ్ అన్నాడు. ‘అటాక్‌తో పోల్చుకుంటే సింధు డిఫెన్స్‌లో కాస్త వెనుకబడి ఉండేది. ఒలింపిక్స్‌కు ముందు దీన్ని మెరుగ పరచడంపై దృష్టి పెట్టడంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి’ అని చెప్పాడు.
టోక్యో: ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్ల కోసం నిర్మించిన క్రీడా గ్రామంలో తొలి కరోనా కేసు నమోదైంది. విశ్వక్రీడల ఆరంభానికి వారం రోజుల ముందు కొవిడ్-19 పాజిటివ్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నా.. ఎలాంటి ఇబ్బంది లేదని టోక్యో క్రీడల ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు సయికో హషిమొటో పేర్కొన్నారు. వైరస్ బారిన పడిన వ్యక్తి ప్రస్తుతం 14 రోజుల కఠిన క్వారంటైన్లో ఉన్నాడని పేర్కొన్న ఆయన.. అతడి వివరాలు మాత్రం బయటపెట్టలేదు.