BWF Rankings : ఒలింపిక్ విజేత పీవీ సింధు(PV Sindhu) ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఈ రోజు ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్(BWF Rankings)లో ఆమె 15వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన సింధు రెండు స్థానాలు ఎగబాకడం విశేషం. ఆస్ట్రేలియా ఓపెన్(Australia Open)లో క్వార్టర్స్‌కు చేరడంతో ఆమె ర్యాంకు మెరుగుపడింది. మరోవైపు స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth)కు మరింత తక్కువ ర్యాంకు దక్కింది.
ఇంతకుముందు 19వ స్థానంలో ఉన్న అతను తాజాగా 20వ ర్యాంకుకు పడిపోయాడు. హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy), లక్ష్యసేన్(Lakshya Sen) ఇద్దరూ వరుసగా 9, 11వ ర్యాంకులో ఉన్నారు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్ చేరిన భారత యువ సంచలనం ప్రియాన్షు రజావత్ మూడు స్థానాలు ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అతను ప్రస్తుతం 28వ స్థానం సొంతం చేసుకున్నాడు. డబుల్స్‌లో అదరగొడుతున్న సాత్విక్ సాయిరాజ్ (Satwiksairaj) – చిరాగ్ శెట్టీ(Chirag Shetty) జోడీ రెండోసీడ్ నిలబెట్టుకుంది.
సాత్విక్ – చిరాగ్ జోడీ
మహిళల డబుల్స్‌లో త్రీష జాలీ(Treesa Jolly), గాయత్రి గోపిచంద్(Gayatri Gopichand) రెండు స్థానాలు కోల్పోయి, 19వ ర్యాంక్‌లో నిలిచారు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న సాత్విక్ – చిరాగ్ ఈమధ్యే కెనడా ఓపెన్ చాంపియన్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా ఓపెన్(Australia Open)లో అనూహ్యంగా సెమీస్ పోరులో ఇంటిదారి పట్టారు. ఈ ఏడాది సాత్విక్ – చిరాగ్ మూడు వరల్డ్ టూర్ టైటిళ్లు సాధించింది. అంతేకాదు ఇండోనేషియా ఓపెన్ ట్రోఫీ అందుకున్న మొదటి భారత డబుల్స్ జోడీగా వీళ్లిద్దరూ రికార్డు సృష్టించారు.