Stuart Broad : యాషెస్ సిరీస్ చివరి టెస్టుతో ఇంగ్లండ్ ప్రీమియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad) క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2006లో అంతర్జాతీయ క్రికెట్(International Cricket)లో అడుగుపెట్టిన బ్రాడ్ తన 17 ఏళ్ల కెరియర్లో జట్టు కోసం నూటికి నూరుశాతం కష్టపడ్డాడు. 167 టెస్టుల్లో 602 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన ఐదో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతేకాదు, ఇంగ్లండ్ తరపున ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గానూ తన పేరు రాసుకున్నాడు. బ్రాడ్ ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో బ్రాడ్ 10 అత్యుత్తమ, మర్చిపోలేని ప్రదర్శనల గురించి తెలుసుకుందాం.
యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు 2015లో ఇంగ్లండ్‌లో పర్యటించింది. మూడు టెస్టుల తర్వాత రెండు విజయాలతో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉంది. ట్రెంట్‌బ్రిడ్జ్(Trent Bridge)లో జరిగిన నాలుగో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్ స్కిప్పర్ అలిస్టర్ కుక్(Alastair Cook) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. స్టువర్ట్ బ్రాడ్ దెబ్బకు కకావికలమైంది.
8 వికెట్లు తీసిన బ్రాడ్‌కు సహచరుల అభినందన
15 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు నేలకూల్చాడు. ఫలితంగా కంగారూ జట్టు తొలి ఇన్నింగ్స్ 60 పరుగులకే ముగిసింది. 21వ శతాబ్దంలో ఆస్ట్రేలియాలో అత్యల్ప స్కోరు అదే. ఆ టెస్టులో ఇంగ్లండ్ 78 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీశ్ను వశం చేసుకుంది. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను దెబ్బకొట్టిన బ్రాడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్టువర్ట్ బ్రాడ్ బంతితోనే కాదు బ్యాట్‌తోనూ మ్యాజిక్ చేశాడు. పాక్ జట్టు 2010లో ఇంగ్లండ్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో బ్రాడ్ తొలి, ఏకైక అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. తొలి మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ రెండు విజయాలతో ముందంజలో నిలిచింది. చివరిదైన నాలుగో టెస్టులో పాక్ కెప్టెన్ సల్మాన్ భట్(Salman Bhatt) టాస్ గెలిచి ఇంగ్లండ్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. పాక్ బౌలింగ్ దెబ్బకు ఇంగ్లండ్ 102 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
బ్రాడ్ (169)
క్రీజులో ఉన్న జొనాథన్ ట్రాట్ – స్టువర్ట్ బ్రాడ్ ఇద్దరూ పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జట్టును కష్టాల నుంచి బయటపడేశారు. ఇద్దరూ కలిసి 332 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ట్రాట్ 184 పరుగులు చేయగా, బ్రాడ్ 169 పరుగులతో తొలి సెంచరీ నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో బ్రాడ్‌కు అదే ఏకైక సెంచరీ కూడా. వీరిద్దరి బాదుడుతో ఇంగ్లండ్ ఏకంగా 446 పరుగులు చేసింది. ఆ తర్వాత పాక్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 74కు, రెండో ఇన్నింగ్స్‌లో 147 పరుగులకు ఆలౌట్ చేసింది. ఫలితంగా ఇన్నింగ్స్ 225 పరుగుతో తేడాతో విజయం సాధించింది.
ఇంగ్లండ్ జట్టు 2013-14 యాషెస్ సిరీస్‌లో క్వాలిటీ క్రికెట్ ఆడింది. ఆ సిరీస్‌లోనూ బ్రాడ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో 9 ఇన్నింగ్స్‌లలో 21 వికెట్లు పడగొట్టాడు. టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయిన ఇంగ్లండ్.. తొలి రెండు టీ20ల్లోనూ ఓడి ఆ సిరీస్‌ను కూడా కోల్పోయింది. అయితే, చివరి మ్యాచ్‌లో నిప్పులు చెరిగిన బ్రాడ్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అయినప్పటికీ ఇంగ్లండ్ 84 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన బ్రాడ్ 30 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. ఆస్ట్రేలియాపై బ్రాడ్ అత్యుత్తమ గణాంకాలు ఇవే.
ఇంగ్లండ్ జట్టు 2013లో న్యూజిలాండ్‌లో పర్యటించింది. తొలి టీ20లో ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్రాడ్ చెలరేగిపోయాడు. 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసి ఓటమి పాలైంది.
2009 చాంపియన్స్ ట్రోఫీలోనూ బ్రాడ్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. న్యూ వాండరర్స్ స్టేడియంలో న్యూజిలాండ్‌ను ఇంగ్లండ్ ఎదుర్కొంది. కివీస్‌కు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ వెటోరీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. ఇంగ్లండ్‌ను 43.1 ఓవర్లలో 146 పరుగులకు కట్టడి చేశారు. గ్రాంట్ ఇలియట్ 8 ఓవర్లు వేసి 31 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. తక్కువ స్కోరును కాపాడుకోవడంలో ఇంగ్లిష్ జట్టు విఫలమైనా బ్రాడ్ మాత్రం అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 8.1 ఓవర్లు వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్ జట్టు 2012లో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20ల కోసం యూఏఈలో పర్యటించింది. తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఇంగ్లిష్ జట్టు వైట్‌వాష్ తప్పించుకునేందుకు చివరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. దుబాయ్‌లో జరిగిన మూడో టెస్టులో బ్రాడ్ అద్భుత స్పెల్‌తో పాక్‌ను బోల్తా కొట్టించాడు.
36 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాక్ 99 పరుగులకే కుప్పకూలింది. అయితే, అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలమైన ఇంగ్లండ్ చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. బ్యాటింగ్‌లో విఫలమై పరాజయం పాలైంది.
దక్షిణాఫ్రికా జట్టు 2008లో ఇంగ్లండ్‌లో పర్యటించింది. ఓపెనింగ్ వన్డేలో ఆతిథ్య జట్టు 20 పరుగుల తేడాతో ప్రొటీస్‌పై గెలుపొందింది. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన రెండో వన్డేలో సఫారీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్() టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బ్రాడ్ విజృంభించాడు. గిబ్స్, స్మిత్‌లను పెవిలియన్ పంపిన బ్రాడ్.. అదే ఊపులో కలిస్, డుమినీ, జోహన్ బోథాలను అవుట్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 83 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప విజయ లక్ష్యాన్ని ఇంగ్లండ్ సునాయాసంగా ఛేదించింది. బ్రాడ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు 2014లో ఇంగ్లండ్‌లో పర్యటించింది. మూడు మ్యాచ్‌ల తర్వాత చెరో మ్యాచ్‌లో విజయం సాధించిన ఇరు జట్లు సమ ఉజ్జీలుగా నిలిచాయి. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టులో బ్రాడ్ బంతితో నిప్పులు చెరిగి ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. వరుస వికెట్లు తీస్తూ బెంబేలెత్తించాడు.
గౌతం గంభీర్, చతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, ధోనీ వికెట్లను పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతను 13.4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దాంతో టీమిండియా 152 పరుగులకే చాపచుట్టేసింది. భారత్‌పై బ్రాడ్‌కు ఇదే అత్యుత్తమం. ఈ టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 54 పరుగులతో విజయం సాధించింది.
ఇంగ్లండ్ జట్టు 2015/16లో సౌతాఫ్రికాలో పర్యటించింది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 2-1తో విజయం సాధించింది. వాండరర్స్ స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ విధ్వంస బౌలింగ్‌తో సౌతాఫ్రికా చిత్తుగా ఓడింది. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన బ్రాడ్.. రెండో ఇన్నింగ్స్‌లో సంచలన గణాంకాలు నమోదు చేశాడు. 17 పరుగులిచ్చి 6 వికెట్లు నేలకూల్చాడు.
ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు 2013 సమ్మర్లో హోరాహోరీగా తలపడ్డాయి. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో తొలి టెస్టు జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 232 పరుగులు చేయగా, ప్రతిగా కివీస్ 207 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ ప్రత్యర్థికి 239 పరుగుల టార్గెట్ ఇచ్చింది.
7 వికెట్లు తీసిన బ్రాడ్