ఒడెన్స్ (డెన్మార్క్): భారత స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. 21-8, 13-7తో పాయ్ యు పొ (చైనీస్ తైఫీ)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు ప్రవేశించింది. ఇదే టోర్నీలో పోటీపడ్డ భారత యువ షట్లర్లు లక్ష్యసేన్, మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ (సింగిల్స్), పాండా సిస్టర్స్ (డబుల్స్) మొదటి రౌండ్లోనే వెనుదిరిగారు.