IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రెండో సెంచరీ నమోదైంది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియన్ష్ ఆర్య(103) శతకంతో గర్జించాడు. ముల్లనూర్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఉతికారేసిన ఈ చిచ్చరపిడుగు 39 బంతుల్లోనే వందకు చేరువయ్యాడు. తద్వారా ఈ లీగ్‌లో నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు.
నిరుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ రికార్డును సమం చేశాడీ యంగ్‌స్టర్. 19 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన ప్రియాన్ష్.. మరో 20 బంతుల్లోనే 50 రన్స్ పిండుకున్నాడు. 54కే మూడు వికెట్లు పడినా ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా శశాంక్ సింగ్()తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడీ చిచ్చరపిడుగు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 103 రన్స్ చేసిన ఈ కిర్రాక్ కుర్రాడు నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
Saving this to our ‘Special Moments’ folder 📂 😌
A knock of the highest caliber from Priyansh Arya as he scores 1️⃣0️⃣3️⃣(42) 💥
Updates ▶ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK | @PunjabKingsIPL pic.twitter.com/BsPfEoKhiB
— IndianPremierLeague (@IPL) April 8, 2025
ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన రికార్డు మాత్రం క్రిస్ పేరిట ఉంది. రాయల్ ఛాలెంజర్స్ తరఫున 2013లో గేల్ విధ్వంసక బ్యాటింగ్‌తో 30 బంతుల్లోనే వంద కొట్టాడు. రెండో స్థానంలో యుసుఫ్ పఠాన్ ఉన్నాడు. 2010లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన ఈ ఆల్‌రౌండర్ ముంబై బౌలర్లను ఉతికేస్తూ.. 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. డేవిడ్ మిల్లర్ 2013లో కింగ్స్‌లెవన్ పంజాబ్ ప్లేయర్‌గా 38 బంతుల్లో శతకంతో గర్జించాడు.