IPL 2024 SRH vs PBKS : ఐపీఎల్ 17వ సీజన్ 23వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun risers Hyderabad), పంజాబ్ కింగ్స్(Punjab Kings) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంబాజ్ కెప్టెన్ ధావన్ బౌలింగ్ తీసుకున్నాడు.
ఇరుజట్లు ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం రెండేసి విజయాలతో హైదరాబాద్ ఐదో స్థానంలో, పంజాబ్ ఆరో స్థానంలో ఉన్నాయి. దాంతో, ఇరుజట్లు ఈ మ్యాచ్‌లో గెలుపుపై కన్నేశాయి. అయితే.. ఈ పిచ్‌పై 200 ప్లస్ స్కోర్ కష్టమే అంటున్నారు. కానీ, హెడ్, అభిషేక్, క్లాసెన్, మర్క్రమ్, సమద్ వంటి విధ్వంసక బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆరెంజ్ ఆర్మీ ముల్లనూర్ స్టేడియంలో బౌండ్రీల వర్షం కురిపిస్తారా? లేదా? చూడాలి.
హైదరాబాద్ తుది జట్టు : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), హహ్బాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కాట్, టి.నటరాజన్.
పంజాబ్ తుది జట్టు : శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభుసిమ్రాన్ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కరన్, సికిందర్ రజా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.