అహ్మాదాబాద్: హై స్కోరింగ్ ఐపీఎల్ థ్రిల్లర్‌లో.. గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ శశాంక్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 29 బంతుల్లో 61 రన్స్ చేసిన శశాంక్ .. తన ఇన్నింగ్స్‌తో విమర్శకులను సైలెంట్ చేశాడు. శశాంక్ హిట్టింగ్ చూసిన ఆ టీమ్ ఓపనర్ ప్రీతి జింతా(Preity Zinta) ఫుల్ ఎంజాయ్ చేసింది. భారీ స్కోర్ గేమ్‌ను థ్రిల్లింగ్‌గా ఫినిష్ చేసిన శశాంక్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ప్రీతి జింతా కూడా ఆ మూమెంట్స్‌ను తెగ సెలబ్రేట్ చేసుకున్నది. ఆమె తన ఎమోషన్స్‌ను ఆపుకోలేకపోయింది. సీటు నుంచి లేచిన ప్రీతి.. తనదైన స్టయిల్లో అభిమానలకు అభివాదం చేసింది. వైరల్‌గా మారిన ఆ వీడియోను మీరూ వీక్షించండి.
Punjab Kings won the match means Preity Zinta is happy. 🫶🤞#IPL2024 #PunjabKings pic.twitter.com/kiTzCY4imF
— Ahtasham Riaz (@ahtashamriaz22) April 4, 2024
శశాంక్ షో..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (48 బంతుల్లో 89, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ధ సెంచరీకి తోడు సాయి సుదర్శన్ (19 బంతుల్లో 33, 6 ఫోర్లు) రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలో తడబడ్డా శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అసమాన పోరాటంతో పాటు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 35, 5 ఫోర్లు, 1 సిక్సర్), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31, 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించి పంజాబ్‌కు విజయాన్ని అందించారు. శశాంక్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.