IND vs PAK : ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఇంకా రెండు రోజులే ఉంది. సెప్టెంబర్ 14న దాయాది జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడనున్నాయి. పహల్దాం ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) తర్వాత ఇరుజట్ల మధ్య జరుగతున్న తొలి మ్యాచ్ ఇది. అయితే.. పాక్‌తో మ్యాచ్‌కు బీసీసీఐ పచ్చజెండా ఊపడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్లు చేస్తున్నవారు కొందరైతే.. పాక్ పేరు లేకుండా పోస్టులు పెడుతున్నారు మరికొందరు. ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) సైతం అలాంటి పోస్ట్‌తోనే ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.
ఆతిథ్య యూఏఈ(UAE)పై భారీ విజయంతో ఆసియా కప్‌ను ఆరంభించింది భారత జట్టు. గ్రూప్ దశలో సూర్యకుమార్ యాదవ్ సేన ఆడబోయే తదుపరి మ్యాచ్ పాకిస్థాన్‌తోనే. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగబోయే ఈ గేమ్‌పైనే అభిమానులందరి దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మ్యాచ్ ప్రచారాన్ని పంజాబ్ కింగ్స్ జట్టు వినూత్నంగా చేస్తోంది. పాక్ జట్టు పేరు, ఆ టీమ్ లోగో ముద్రించకుండానే టీమిండియ రెండో మ్యాచ్ అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది పంజాబ్ యాజమాన్యం.
Game 2️⃣ for the defending champions. Let’s goooo 💪#AsiaCup2025 #INDv pic.twitter.com/BgeoRfJjMo
— Punjab Kings (@PunjabKingsIPL) September 11, 2025
‘ఆసియా కప్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టుకు రెండో మ్యాచ్. లెట్స్ గో’ అంటూ టీమిండియా విజయాన్ని కాంక్షించింది పంజాబ్. అయితే.. ఆ పోస్ట్‌లో భారత్ వర్సెస్ పాక్ అని ఉండాలి. కానీ, ప్రత్యర్థి పేరు, లోగో స్థానాన్ని ఖాళీగా ఉంచి పాక్‌పై తమ అయిష్టతను వ్యక్తం చేసింది ఐపీఎల్ రన్నరప్. పంజాబ్‌కు చెందిన ఆటగాళ్లు పాక్‌తో క్రికెట్ వద్దే వద్దని అంటున్నారు.
VIDEO | When asked about upcoming India-Pakistan game in Asia Cup, former cricketer and AAP MP Harbhajan Singh (@harbhajan_singh) says, “India-Pakistan always come in limelight. Operation Sindoor happened. Everybody said there should not be cricket games, business with Pakistan.… pic.twitter.com/OorDUnVjGw
— Press Trust of India (@PTI_News) September 11, 2025
జలంధర్ వాస్తవ్యుడైన హర్భజన్ సింగ్ (Harbhajan Singh) దాయాదితో క్రికెట్, వ్యాపారం అన్ని ఆపేయాలని డిమాండ్ చేశాడు. ‘భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ ఎల్లప్పుడూ అభిమానులను ఆకర్షిస్తూనే ఉంటుంది. కానీ, ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిణామాలు మారిపోయాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ ఇకపై పాక్‌తో క్రికెట్, వ్యాపారం ఏవీ వద్దనుకుంటున్నారు’ అని భజ్జీ మీడియాతో వెల్లడించాడు.