అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్వల్ప వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది. కమిన్స్ వేసిన ఆరో ఓవర్లో కేఎల్ రాహుల్..మిడాఫ్‌లో సునీల్ నరైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పవర్‌ప్లే ఆఖరికి పంజాబ్ 37/1తో నిలిచింది. శివమ్ మావి వేసిన తర్వాతి ఓవర్లో ఎదుర్కొన్న తొలి బంతికే క్రిస్‌గేల్ పెవిలియన్ చేరాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన ఎనిమిదో ఓవర్లో ఫామ్‌లో ఉన్న దీపక్ హుడా మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్ 44 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్(20), నికోలస్ పూరన్(1) క్రీజులో ఉన్నారు.
OUT
— IndianPremierLeague (@IPL) April 26, 2021
A first ball duck for the Universe Boss!@ShivamMavi23 induces an outside edge, DK takes it and he wanted #KKR to review it. It is in their favour and Gayle has to return.https://t.co/sBoaBIpF2J #PBKSvKKR #VIVOIPL pic.twitter.com/X3dnY3cAXB