అహ్మదాబాద్ : విజయ్ హజారే టోర్నీలో హైదరాబాద్ ఒడిదొడుకుల పయనం కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన గ్రూపు-సీ మ్యాచ్‌లో హైదరాబాద్ 80 పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది. తొలుత పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 426-4 భారీ స్కోరు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌సింగ్(137), అభిషేక్‌శర్మ(93), రమణ్‌దీప్‌సింగ్(80) దుమ్మురేపడంతో పంజాబ్ పరుగుల వరద పారించింది. ముదాసిర్, నిశాంత్, అనికేత్, తనయ్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 47.5 ఓవర్లలో 346 పరుగులకు ఆలౌటైంది. నితేశ్‌రెడ్డి(111), తనయ్ త్యాగరాజన్(74) రాణించినా లాభం లేకపోయింది. అర్ష్‌దీప్‌సింగ్(4), రఘుశర్మ(3) విజృంభించారు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ మూడింటిలో గెలిచి, మూడు ఓడింది.