కోజికోడ్ : భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషా ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త వి. శ్రీనివాసన్ (67) శుక్రవారం ఉదయం హఠాన్మరణం చెందారు. తిక్కోడిలోని వారి నివాసంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన ఆయనను కుటుంబసభ్యులు సమీపాన ఉన్న దవాఖానాకు తీసుకెళ్లినా అప్పటికే శ్రీనివాసన్ మరణించినట్టు వైద్యులు తెలిపారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఉషా.. విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన కేరళకు చేరుకున్నారు. ప్రధాని మోడీ.. ఉషాకు ఫోన్ చేసి ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాసన్ సీఐఎస్ఎఫ్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు.