న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్లో కిరాక్ హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. లీగ్ ఆసాంతం ఆకట్టుకున్న హైదరాబాద్ జట్టు ఫైనల్లో టై బ్రేకర్‌లో వెనుకబడింది. ఆదివారం జరిగిన తుదిపోరులో హైదరాబాద్ 28-30 తేడాతో కొచ్చి కేడీస్ చేతిలో పోరాడి పరాజయం పాలైంది.
అండర్ కార్డు, మెయిన్ కార్డుల మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు మసంగా నిలువగా.. టై బ్రేకర్‌లో సత్తాచాటిన కొచ్చి తొలి సీజన్ ట్రోఫీ కైవసం చేసుకుంది. సీజన్లో అద్భుతంగా పోరాడి రెండో స్థానంలో నిలిచిన హైదరాబాద్ ఆర్మ్ రెజ్లర్లను ఫ్రాంచైజీ యజమాని నేదురుమల్లి గౌతమ్ రెడ్డి, సీఈవో త్రినాథ్ రెడ్డి అభినందించారు.