డంబుల్లా: శ్రీలంక-ఏ టీమ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత-ఏ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 రన్స్ చేసింది. యువ సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అతను కేవలం 12 రన్స్ మాత్రమే చేశాడు. ఇక ప్రభుసిమ్రన్ కూడా స్వల్ప స్కోరుకే నిష్క్రమించాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్, ప్రియాన్షు ఆర్యా భారత బ్యాటింగ్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో.. ప్రియాన్షు ఆర్యా అనూహ్య రీతిలో రనౌటయ్యాడు.
వాస్తవానికి స్ట్రయికర్‌గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ రెండో రన్‌కు ప్రయత్నించాడు. ప్రియాన్షు కూడా రెండో రన్ కోసం కొన్ని అడుగులు వేసి మళ్లీ వెనక్కి వచ్చేశాడు. ఈ లోగా రుతురాజ్ రెండో రన్ పూర్తి చేసి క్రీజ్‌లో తన బ్యాట్‌ను పెట్టాడు. అయితే అక్కడే నిలబడ్డ ప్రియాన్షు ఆర్యా తన బ్యాట్‌ను క్రీజ్‌లో పెట్టే సమయంలో శ్రీలంక కీపర్ నిరోషాన్ డిక్వెల్లా షూ అడ్డు వచ్చింది. దీంతో ఆర్యా బ్యాట్ క్రీజ్‌లోకి చేరుకోలేకపోయింది. అయితే ఫీల్డర్ ఇచ్చిన బంతిని అందుకున్న కీపర్ నాన్ స్ట్రయికర్ వైపు విసిరేశాడు.
ఆర్యా తన బ్యాట్‌ను క్రీజ్‌లో పెట్టకపోవడం వల్ల దురదృష్టవశాత్తు రనౌట్ కావాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ సెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్ తిలక్ వర్మ 60 రన్స్ చేశాడు.
Priyansh Arya gave a call to Ruturaj for 2nd run then backed off but karma hit instantly, keeper blocked his bat and Arya got out 😭😭#INDAvsSLA pic.twitter.com/pNNicubc9K
— سهيل (@tweetsbysohaill) June 9, 2026