Rinku-Priya Wedding | భారత క్రికెటర్ రింకు సింగ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోడుతున్నాడు. ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్‌ను మనువాడనున్నాడు. ఈ విషయాన్ని ప్రియా తండ్రి, యూపీలోని కెరకట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తుఫానీ సరోజ్ ధ్రువీకరించారు. పెళ్లి విషయంపై అలీఘఢ్‌లో రింకు తండ్రితో చర్చించినట్లు ఆయన వివరించారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత నిశ్చితార్థం, వివాహ తేదీలను నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు.
నిశ్చితార్థం లక్నోలో జరుగుతుందని పేర్కొన్నారు. జౌన్‌పూర్‌లోని మచ్లిషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై ప్రియా సరోజ్ గెలుపొందారు. అయితే, రింకు సింగ్, ప్రియా నిశ్చితార్థం జరిగినట్లు వచ్చిన వార్తలు తుఫానీ సరోజ్ కొట్టిపడేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. ఇంకా ఇద్దరి నిశ్చితార్థం జరుగలేదని చెప్పారు. గత గురువారం రింకు కుటుంబాన్ని అలీగఢ్‌లో కలిసినట్లు పేర్కొన్నారు. వివాహం విషయంలో చర్చలు అర్థవంతంగా జరిగాయన్నారు.
పార్లమెంట్ సమావేశాల జనవరి నెలాఖరు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయన్నారు. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత నిశ్చితార్థం, వివాహ తేదీలను నిర్ణయించున్నట్లు తెలిపారు. ఇక రింకు సింగ్ ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొననున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ జరుగబోతుంది. ఐపీఎల్లో కేకేఆర్ తరఫున బరిలోకి దిగనున్నాడు. రూ.13కోట్లకు రింకు సింగ్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది.
ఈ క్రమంలో ఎంగేజ్మెంట్, వివాహ తేదీల విషయంలో రింకు పెళ్లి తేదీలను జాగ్రత్తగా చూడాల్సి ఉందని.. పెళ్లితో ఆటకు ప్రభావితం కాకుండా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రియా సరోజ్ స్నేహితురాలి తండ్రి క్రికెటర్ అని తుఫానీ సరోజ్ తెలిపారు. ఆయన ద్వారా రింకు, ప్రియా ఇద్దరూ కలిశారన్నారు. ఇద్దరూ ఇరుకుటుంబాల అనుమతి పెళ్లి చేసుకుంటామని చెప్పారని.. ఈ క్రమంలోనే రింకు కుటుంబంతో చర్చలు జరిపామన్నారు. రెండు కుటుంబాల మధ్య పెళ్లి విషయంలో చర్చలు జరిగాయని తుఫానీ సరోజ్ వివరించారు.
ISRO | ఇస్రో మరో మైలురాయి.. విజయవంతంగా వికాస్ ఇంజిన్ రీస్టార్ట్