ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా అరుదైన ఘనత సాధించాడు.
సూపర్ ఫామ్‌లో ఉన్న షా బౌండరీలతో విజృంభిస్తున్నాడు. శిఖర్ ధావన్‌తో కలిసి శుభారంభాలు
అందిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో
జరిగిన మ్యాచ్‌లో బౌండరీల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ స్టార్ బ్యాట్స్మెన్లు ఆశ్చర్యపోయేలా
ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించాడు. కోల్‌కతాతో మ్యాచ్‌లో ఆరంభం నుంచి చెలరేగిన
షా ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు(Wd, 4, 4, 4, 4, 4, 4) కొట్టాడు.
యువ పేసర్ శివమ్ మావీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వీరవిహారం చేశాడు. షా దంచికొట్టడంతో తొలి ఓవర్లోనే 25 పరుగులు వచ్చాయి. ఐపీఎల్ చరిత్రలో భారత సీనియర్ బ్యాట్స్‌మన్, ప్రస్తుతం ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రహానె తర్వాత ఒకే ఓవర్లో 6 ఫోర్లు కొట్టిన రెండో క్రికెటర్ పృథ్వీ షానే కావడం విశేషం. 2012లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన రహానె రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఈ ఫీట్ సాధించాడు. షా ఫోర్ల విధ్వంసంపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్‌గా మారాయి. కొంతమంది పృథ్వీని మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌తో పోలుస్తూ ట్వీట్ చేస్తున్నారు.
No prizes for guessing who the Man of the Match was last night 🔥#YehHaiNayiDilli #IPL2021 #DCvKKR @PrithviShaw @aplapollo_tubes pic.twitter.com/03LJmb7aKT
— Delhi Capitals (@DelhiCapitals) April 30, 2021
Wd, 4, 4, 4, 4, 4, 4@PrithviShaw 24 (6) has set the stage on 🔥
— IndianPremierLeague (@IPL) April 29, 2021
Six boundaries in the 1st over bowled by Mavi.😳https://t.co/iEiKUVwBoy #DCvKKR #VIVOIPL pic.twitter.com/5ISeFsKWA0