IPL 2024 MI vs DC : ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసక ఓపెనర్ పృథ్వీ షా(65) హాఫ్ సెంచరీ బాదాడు. 235 పరుగుల భారీ ఛేదనలో దంచుతున్న షా 31 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు. మరో ఎండ్లో యువ బ్యాటర్ అభిషేక్ పొరెల్(31) సైతం దూకుడుగాగా ఆడుతున్నాడు. దాంతో, ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఓవర్లకు వికెట్ నష్టానికి రన్స్ కొట్టింది. మ్యాచ్ గెలవాలంటే పంత్ సేన ఇంకా పరుగులు చేయాలి.
వరుసగా రెండో మ్యాచ్లో రెండొందల పైచిలుకు లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్లో ఉన్న డేంజరస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(10) ఔటయ్యాడు. రొమారియో షెపర్డ్ బౌలింగ్లో సిక్సర్ బాదిన వార్నర్.. ఆ తర్వాత స్లో డెలివరీకి పాండ్యా చేతికి చిక్కాడు. దాంతో, 22 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ పడింది.
హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన ముంబై ఇండియన్స్ సొంత స్టేడియంలో గర్జించింది. ఆ జట్టు టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించారు. తొలుత ఓపెనర్లు రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(44) శుభారంభమివ్వగా.. విధ్వంసక ప్లేయర్ టిమ్ డేవిడ్(45), రొమారియో షెపర్డ్(39)లు చివర్లో వీరవిహారం చేశారు. దాంతో ముంబై 5 వికెట్ల నష్టానికి 234 రన్స్ కొట్టింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు, అన్రిచ్ నోకియాలు రెండేసి వికెట్లు పడగొట్టారు.